సీఎం’లతో ప్రధాని మరోసారి వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ మాట్లాడనున్నారు. మొదటగా అత్యధిక కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నట్లు సమాచారమ్. కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై చర్చించనున్నారు.
ఇక దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ప్రతిరోజు దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి. వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 54,00,619కి చేరగా..ఇప్పటి వరకు 86,752 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ లో రికవరీ రేటు 79.28గా ఉండటం ఊరటనిస్తోంది.