తొలి ఓటమే.. ముంబై తొలి గెలుపు !
ఐపీఎల్’లో అత్యధిక టైటిల్స్ గెలిచిన రికార్డ్ ముంబై ఇండియన్స్ సొంతం. ఏకంగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2013, 2015, 2017, 2019లలో టైటిల్ ని గెలుచుకుంది. అయితే, టోర్నీలో ఆడిన తొలిమ్యాచ్ లో ఓడిపోవడం ముంబైకి అలవాటుగా వస్తోంది. 2013 నుంచి 2020 వరకు ముంబై తొలి మ్యాచ్ లో గెలవలేదు. నిన్న చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లోనూ ముంబై 5 వికెట్లతో తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ ని ముంబై ఘనంగా ఆరభించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ కి దిగిన ముంబై తొలి 4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్ తో గేమ్ ఛేంజ్ చేసింది. ఇక బ్యాటింగ్ లో అంబటి రాయుడు, డుప్లెసిస్ రాణించడంతో చెన్నై ఈజీగా గెలిచేసింది. మొత్తంగా చెన్నై మ్యాచ్ గెలిస్తే.. ముంబై కూడా ఓడి గెలిచింది. ఎందుకంటే ? ఆ జట్టుకు తొలి మ్యాచ్ ఓడిపోవడం ఓ సెంటిమెంట్ గా మారింది.