బిగ్ బాస్ ప్లాన్.. బిగ్ ప్లాప్ !


తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా రెండు వారాలని పూర్తి చేసుకుంది. అయితే రెండోవారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ సప్రైజ్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్. శనివారం కరాటే కల్యాణ్ ని ఎలిమినేట్ చేశారు హోస్ట్ నాగార్జున. ఆదివారం మరో ఎలిమినేషన్ అంటూ దేత్తడి హారిక, మోనాల్ గుజ్జర్ ని టార్గెట్ చేశాడు. దీని వెనక రొమాంటిక్ యాంగిల్ ఉన్నట్టు అర్థమవుతోంది. లవ్ స్టోరీని బయటికి తీసే క్రమంలోనే బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్టు అర్థమైంది.

బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ అఖిల్, అభిజిత్ తో క్లోజ్ గా ఉంటుంది. ఒక్కోకరితో ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దింపుతోంది. వారు కూడా మోనాల్ కి అట్రాక్ అయినట్టు కనిపించింది. మరోవైపు అభిజిత్, నిహారికల మధ్య మంచి కెమెస్ట్రీ నడుస్తోంది. వీరి మధ్య మాటలు తక్కువ.. చూపులు ఎక్కువ అన్నట్టు ఉంది. అయితే ఈ ప్రేమజంటలు ఎక్కడ ఓపెన్ కావడం లేదు. ఎవరు బయటపడటం లేదు. దాన్ని బ్రేక్ చేసేందుకే బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పేరిట రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాకు తెరలేపినట్టు అనిపించింది.

టార్గెట్ చేసినట్టు హారిక, మోనాల్ ని డేంజర్ జోన్ లో పెట్టేసి.. వారిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని ఇంట్లోని ఏడుగురికి అప్పగించాడు నాగ్. ఈ ఏడుగురిలో ఎక్కువ మంది హారికని ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేట్ అవుతున్నట్టు నాగ్ ప్రకటించారు. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్తున్న టైమ్ లో ఎమోషన్స్ ని బిగ్ బాస్ క్యాష్ చేసుకున్నాడు. కానీ బిగ్ బాస్ లక్ష్యం నెరవలేదు. హారిక విషయంలో అభిజిత్ బయటపడలేదు. ఒకవేళ హారిక కాకుండా.. మోనాల్ ఎలిమినేట్ అయితే పరిస్థితి డిఫరెంట్ గా ఉండేది. మరింత ఎమోషన్స్ పండేవి. అఖిల్, అభిజిత్ లలో ఎవరో ఒకరు ఓపెన్ అయ్యేవారేమో. అందుకే బిగ్ బాస్ బిగ్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందని చెప్పవచ్చు.