బిగ్ బాస్ 4 : మూడోవారం నామినేషన్ లిస్టులోకి వచ్చింది.. వీరే !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మూడో వారంలోకి ఎంటర్ అయింది. ప్రతి సోమవారం బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా పొయ్యి మంటపెట్టి… ఒక్కో ఇంటి సభ్యుడిని పిలిచి ఈవారం ఎవరిని ఎలిమినేషన్ లిస్టులోకి పంపాలనుకుంటున్నారో.. వారి ఫోటోని మంటల్లో వేయమని ఆదేశించాడు. ఇలా ఒక్కోక్కరు ఇద్దరి ఫోటోలని మంటల్లో వేయవలిసి ఉంటుంది.

ఈ మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏడుగురు ఎలిమినేషన్ లిస్టులో వచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో దేవి,  లాస్య, హరియానా, కుమార్ సాయి, మెహబూబ్, దేత్తడి హారిక ఉన్నారు. ఇక గంగవ్వ ఈ వారం ఎలిమినేషన్ లిస్టులోకి రాలేదు. దీంతో.. అవ్వ ఈవారం సేవ్ అయినట్టే. ఈ ఏడుగురిలో ఎవరికి తక్కువ ఓట్లు పోలయితే వారిని ఆదివారం హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అయినట్టు ప్రకటించనున్నారు.