వ్యవసాయ బిల్లుపై కేటీఆర్ కామెంట్ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్టసభలు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబురాలు జరిగాయని, బిల్లుపై రైతులోకం పూర్తిస్థాయిలో హర్షించిందని గుర్తు చేశారు. కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనం చేకూర్చినవైతే.. వారంతా ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదు. ఎన్టీయే మిత్రపక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయి?? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కేంద్ర నిధులపై కూడా కేటీఆర్ ప్రస్తావించారు.కొవిడ్‌ మహమ్మారిపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.7వేల కోట్లు ఇచ్చిందని భాజపా ఎంపీలు చెప్తున్నారని.. అదే సమయంలో రూ.290కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిందని కేటీఆర్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌లను మంత్రి ట్విటర్‌లో పోస్టు చేశారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు కేటీఆర్.