వైరల్ : సితార తీసిన ‘మహేష్-నమ్రత’ పిక్

సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికిన ఫ్యామిలీతో గడుపుతారు. ఫ్యామిలీ కలిసి సడెన్ గా ఫారిన్ టూర్స్ కి వెళ్తుంటారు. సప్రైజ్ చేస్తుంటారు. ఇక కరోనా లాక్‌డౌన్‌ గత ఆర్నెళ్లుగా మహేష్ ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులు సంతోష పెడుతున్నారు.

తాజాగా మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్ట్రా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో నమ్రత మహేష్ ఒళ్లో కూర్చుంది. ఈపిక్ ని స్వయంగా సితార తీసిందని నమ్రత తెలిపింది. మన ఉనికికి మూలకారణం ప్రేమే అని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రేమ మాత్రమే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ వల్ల వచ్చే భావోద్వేగం నుంచి ఉత్పన్నమవుతాయి. ఇది నా అవగాహన. అందరూ ప్రేమగా, ఒకరికొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఇవే నా నిజమైన సంతోషానికి కారణం రాసుకొచ్చారు.

ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి  పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్  హీరోయిన్. కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం అవుతోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.