కార్తికేయ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది

‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కార్తీకేయ. రెండో సినిమా ‘ఆర్ఎక్స్100’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కార్తీకేయ కటౌట్ చూసి టాలీవుడ్ కి మరో ప్రభాస్ దొరికాడు అనుకున్నారు. కానీ కథల ఎంపికల తప్పటడుగు వేసిన కార్తీకేయకు వరుసగా ప్లాప్ అయ్యాయ్. హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలు ప్లాప్ అయ్యాయ్. ఇక నాని ‘గ్యాంగ్ లీడర్’లో కార్తీకేయ విలన్ పాత్రలో నటించి మెప్పించారు.

కార్తీకేయ తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు కార్తీకేయ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది గీతా ఆర్ట్స్. ఈ సినిమాలో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి జతకట్టనుంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కామేడీ డోస్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.