కొత్త కుర్రాడు పడికల్ అదరగొట్టాడు


యువ ఆటగాళ్లకి ఐపీఎల్ మంచి వేదిక. ప్రతి యేడాది ఐపీఎల్ ద్వారా యువకులు వెలుగులోకి వస్తుంటారు. జాతీయ జట్టులో చోటుకు ఐపీఎల్ ని వేదికగా మలుచుకుంటారు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 13లో కొత్త కుర్రాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా జరుగుతున్న బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్ లో ఆర్ సీబీ యువ ఆటగాడు 56 (42 బంతుల్లో) అదరగొట్టేశాడు. పడికల్ ఆడుతుంటే.. యువరాజ్ గుర్తుకు వచ్చాడు.

మంచి ప్లేస్ మెంట్ తో షాట్స్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్ తోనే ఆకట్టుకున్నాడు. అయితే అండర్ 19లో అసాధరణ ప్రతిభతో టీమ్‌లో టాప్ బాట్స్‌మెన్ కొనసాగాడు. గత ఏడాది విజయ్ హజారే ,సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 2017 కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌దట్ 53 బంతుల్లో 72 పరుగులు చేసి అందర్ని దృష్టిని ఆకర్షించాడు. 17 ఏళ్ళ వయసులోనే ఇలాంటి హిట్టింగ్ ఆడడం అతని ప్రతిభకు నిదర్శనం. 2019 ఐపిఎల్ ప్లేయర్స్ వేలంలో ఆర్‌సిబి ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ లో ఆర్ సీబీకి పడికల్ రూపంలో ఓ ఆణిముత్యం దొరికినట్టయింది. ఇక టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్ సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.