ఆర్ఆర్ఆర్ : తారక్ ఫస్ట్ లుక్ ముహూర్తం ఖరారు 

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మల్టీస్టారర్ నుంచి ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే కానుకగా (మార్చి 27) ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట మోషన్ పోస్టర్ వదిలారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా (20 మే) ‘రామరాజు ఫర్ భీమ్’ మోషన్ పోస్టర్ వస్తుందని అభిమానులు ఆశించారు. వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లించి. కరోనా ఎఫెక్ట్ తో ‘రామరాజు ఫర్ భీమ్’ అందించలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ తిరిగి ప్రారంభమైన పది రోజుల్లోనే తారక్ లుక్ ని రిలీజ్ చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి  తెలిపారు.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? రామరాజు ఫర్ భీమ్ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్సయింది. దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్ పనులు మొదలెట్టారు. సంగీత దర్శకుడు కీరవాణి ఆర్.ఆర్  సమకూర్చే పనిలో ఉన్నాడట. ఇక దీపావళికి అజయ్ దేవ్‌గణ్ పాత్రకు సంబంధించిన మరో టీజర్‌ను బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి బహుమతులు క్యూ కట్టబోతున్నాయి. ఇక వచ్చే యేడదాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ కరోనా దెబ్బతో వేసవికి వెళ్లింది.