అశ్విన్ కోలుకున్నారు.. నెక్ట్స్ మ్యాచ్ కి రెడీ !

ఆదివారం పంజాబ్‌, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి మంచి జోరుమీద కనిపించాడు. అంతలోనే గాయం కారణంగా మైదానం వీడాడు. శరీర బరువు మొత్తం ఒకే చేయిపై పడటంతో భుజంలో ఎముక కాస్త పక్కకు జరిగిందని ఫిజియో తెలిపాడు.

అశ్విన్‌ కిందపడ్డ విధానం చూస్తే అతను ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యేట్లుగా అనిపించింది. అయితే అశ్విన్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఆ జట్టు సారథి శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. తాను తర్వాతి మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక సూపర్ ఓవర్ లో ఢిల్లీ సూపర్ విన్ అయిన సంగతి తెలిసిందే.