ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం సీనియర్ దర్శకుడు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదో సైన్స్ ఫిక్షన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఇప్పుడీ సినిమా కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పని చేయబోతున్నారు. ఆయన్ని క్రియేటివ్ హెడ్ గా తీసుకున్నట్టు వైజంతి మూవీస్ ప్రకటిచింది. సింగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెక్నాలజి అంతా అంతే ఉన్నప్పుడే  విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సోషియో ఫాంటసీ సినిమాలు తీశాడు సింగీతం. ఆ అనుభవాన్ని ప్రభాస్ సినిమా కోసం వాడుకోబోతున్నారు.

ఈరోజు సింగీతం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం ఆయన పనిచేస్తున్నారని వైజంతి మూవీస్ అధికారకంగా ప్రకటించింది. ‘మా చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. మా ఎపిక్ లోకి సింగీతం గారిని ఆహ్వానిస్తున్నందుకు ఎంతో అనుభూతి చెందుతున్నాం. ఆయన సృజనాత్మక శక్తులు మాకు కచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాయి’ అని వైజయంతి మూవీస్ ట్విట్ చేసింది.

ఇక ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ యేడాది డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. రామయణ యుద్ధకాండగా తెరకెక్కనుంది.