మెగా ట్విట్ : సెప్టెంబర్ 22 – నటుడిగా ప్రాణం పోసిన రోజు
మెగాస్టార్ చిరంజీవి తన తొలి సినిమా జ్ఝాపకాలని అభిమానులతో పంచుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ స్పెషల్ ట్విట్ చేశారు. ఈరోజు తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
“నా జీవితంలో ఆగస్ట్22 (మెగాస్టార్ పుట్టినరోజు)కి ఎంత ప్రాధాన్యత ఉందో.. సెప్టెంబర్ 22కి అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు 22 నేను మనిషిగాప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22 నటుడుగా ప్రాణం (ఖరీదు) పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్నింతగా ఆదరించి.. ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్పూర్తిగా కృతజ్ఝతలు తెలిపుకుంటున్నా” నని ఓ నోట్ ని మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రసుత్తం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నరు. కాజల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించి వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు సమాచారమ్.
#BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020