షాకింగ్.. అరుదైన వ్యాధి బారినపడిన కీరవాణి !

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి అరుదైన వ్యాధి బారినపడ్డారు. ఎంఎస్‌ (మల్టిపుల్‌ సెలిరోసిస్‌) అనే వ్యాధితో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కీరవాణినే తెలిపారు. ఈ మేరకు  ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

“నేను గత కొన్ని రోజులుగా ఎంఎస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఇది ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావొచ్చు. ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాధిపై ‘ఎంఎస్‌ ఇండియా’ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవాళ్లు ధైర్యంగా ఉండేలా ఇతరులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. యోగా, మ్యూజిక్‌ వంటి వాటితో ఈ వ్యాధి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు” అని కీరవాణి తెలిపారు.

ప్రస్తుతం కీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ పాటలు పూర్తి చేసిన కీరవాణి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పనులు చూస్తున్నట్టు సమాచారమ్. ఇక ఇటీవలే కీరవాణి కరోనా బారినపడి కోలుకున్నారు. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు.