ఏకంగా మోడీనే టార్గెట్ చేసిన కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమలకు రావాలని ఏపీ బీజేపీ అడగాలని నాని కామెంట్ చేశారు. తిరుమల వెంకన్నపై కొడాలి నాని చేసిన విమర్శలపై బీజేపీ నేతలు.. పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని కనిపిస్తే.. తేల్చేకొనేందుకు రెడీ అయ్యారు.
ఇలాంటి సమయంలో కొడాలి నాని ఏకంగా ప్రధానిని టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. నాని ఎవరి కంటపడకుండా తిరుమలకి చేరుకున్నారు. వాస్తవానికి సీఎంతో పాటు ఆలయం కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో నాని పేరు లేదు. అయినా ప్రభుత్వ పెద్దల నుంచి హుటాహుటిన రావాలనే సందేశం రావడంతో తిరుమలకు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడి.. తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో నానిపై ఏపీ భాజాపా నేతలు పగ-ప్రతీకారాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి.