చెన్నైకి షాక్ ఇచ్చిన రాజస్థాన్

ఐపీఎల్13 లో భాగంగా బుధవారం నాల్గో మ్యాచ్ చెన్నై-రాజస్థాన్ ల మధ్య జరిగింది. హాట్ ఫెవరేట్ చెన్నైకి రాజస్థాన్ షాక్ ఇచ్చింది. మ్యాచ్ అమాంతం రాజస్థాన్ పై చేయి సాధిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత సంజూ శాంసన్ ‌(74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్‌స్మిత్‌(69; 47 బంతుల్లో 4×4, 4×6) సిక్సుల వర్షం కురిపించగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌(27; 8 బంతుల్లో 4×6) సైతం అదే పనిచేశాడు. అతడు నాలుగు సిక్సులు సంధించి ఆ జట్టు స్కోరును 216కి తీసుకెళ్లాడు.

217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(72; 36 బంతుల్లో 1×4, 7×6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. షేన్‌వాట్సన్‌(33), మురళీ విజయ్‌(21), సామ్‌ కరన్‌(17), కేదార్‌ జాధవ్‌(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్‌ ధోనీ(28; 16 బంతుల్లో 3×6) హ్యాట్రిక్‌ సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోర్‌ 200కి చేరింది. దీంతో 17 పరుగులతో తేడాతో రాజస్థాన్ గెలుపొందింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ తోనే తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.