సుశాంత్ టాలెంట్ మేనేజర్ చెప్పిన షాకింగ్ విషయాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుని సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతిఒక్కర్నీ ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాని ఎన్సీబీ అధికారులు రెండు రోజులపాటు విచారణ చేశారు. ఆమె సుశాంత్ తీసుకునే పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది.
016 నుంచి సుశాంత్ టాలెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జయ ‘సన్‌చురియా’, ‘కేదార్నాథ్’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్’ సినిమాలు హీరోకి వచ్చేలా చేసింది. ‘సన్‌చురియా’ చిత్రానికి రూ.5 కోట్లు తీసుకున్న సుశాంత్ ‘కేదార్నాథ్’కి రూ.6 కోట్లు, ‘డ్రైవ్’కి రూ.2.25 కోట్లు, ‘చిచ్చోరే’కి రూ.5 కోట్లు, ‘దిల్ బెచారా’కి రూ.3.5 కోట్లు పారితోషికంగా అందుకున్నారని ఆమె ఎన్సీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా 2016 నుంచి 2019 వరకూ 21 బ్రాండ్స్‌కి సుశాంత్‌తో ఒప్పందం కుదిర్చేలా చేశానని ఆమె విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే కుమార్ మంగళ్ తెరకెక్కించనున్న ఓ సినిమా గురించి తాను చివరిసారి జూన్ 5న సుశాంత్‌తో మాట్లాడాడని.. అయితే కథ నచ్చినప్పటికీ మొదట సంతకం చేసిన రూ.6 కోట్లు కాకుండా దానికి బదులు రూ.12 కోట్లు పారితోషికం కావాలని సుశాంత్ కోరారని జయా ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.