ప్రధానిపై నాని కామెంట్స్.. తప్పుబట్టిన ఏపీ ప్రభుత్వం !


ఏపీ మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలపై, ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి దిగింది. నానిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాని వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని సజ్జల అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.మోదీ గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని.. నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు. దీంతో.. మోడీపై నాని చేసిన వ్యాఖ్యలని ఏపీ ప్రభుత్వం ఖండించినట్టయింది.