సీఎం కేసీఆర్ నగర వాసులకి తీపి కబురు చెప్పబోతున్నారా ?

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి ముందు నగర వాసులకి సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. 120 గజాల లోపు నోటరి ప్లాట్లకి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామిని నిలబెట్టుకున్నారు. దీంతో.. గ్రేటర్ హైదరాబాద్ లో పేద ప్రజలకి ఓ భరోసా కలిగింది. సొంతింటి కలని నేరవేర్చినట్టయింది. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి నగర వాసులని ఖుషి చేయనున్నారు. నోటరీ ప్లాట్ల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారమ్.

మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నోటరీ జీవోలు 58, 59 పరిధిలోని.. పేదలకు ఉచితంగా క్రమబద్దీకరణ అంశంపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదుపై ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో నగర వాసులకి కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.