కరోనా ఎఫెక్ట్ : భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

కరోనా ఎఫెక్ట్ తో  51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో చలన చిత్రోత్సవం జరగాల్సి ఉంది. ఇప్పుడీ వేడుకని వచ్చే యేడాదికి వాయిదా పడింది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ వెల్లడించారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు పేర్కొన్నారు.  2021 జనవరి 16 నుంచి 24 తేదీల్లో గోవాలో అన్ని మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించినట్టు జావడేకర్‌ తెలిపారు.

మరోవైపు కరోనా లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్, థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్ లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే థియేటర్స్ రీపెన్  కి మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. వచ్చే నెల నుంచి థియేటర్స్ రీ ఓపెన్ కి కేంద్రం అనుమతులు ఇవ్వనుందని తెలుస్తోంది.