చిత్తు చిత్తుగా ఓడిన బెంగళూరు
ఐపీఎల్ లో బెంగళూరు తీరు ఏమాత్రం మారలేదు. జట్టులో అందరూ స్టార్ ఆటగాళ్లే. కానీ ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. అయితే ఈ సీజన్ లో బెంగళూరు విజయంతో ఖాతా తెరచింది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలుపొందింది. అయితే ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం పేలవంగా ఆడింది. చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
తొలి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి చివరి వరకు క్రీజులో ఉండి శతకంతో చెలరేగాడు. అతడికి మయాంక్ అగర్వాల్ (26; 20 బంతుల్లో 4×4) శుభారంభం అందించగా తర్వాత నికోలస్ పూరన్ (17; 18 బంతుల్లో 1×4), కరన్ నాయర్ (15; 8 బంతుల్లో 2×4) సహకరించారు. 207 భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 109 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.