డ్రగ్స్ కేసు : రకుల్’కు నోటీసులు అందాయ్.. రేపు ఎన్సీబీ ముందుకు !
బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ఈ ఉదయం వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేని రకుల్ చెప్పింది. అయితే అవన్నీ సాకులన్నీ ఎన్ సీబీ అధికారులు కొట్టిపారేశారు.
ఎన్సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్ర.. రకుల్ కు నోటీసులు జారీపై మాట్లాడారు. మేము ఆమెకి సమన్లు జారీ చేశాం. అలాగే ఫోన్, ఇతర ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ ఆమె మాకు అందుబాటులోకి రాలేదు. సమన్ల విషయమై ఇప్పటివరకూ ఆమె నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు.’ అని వివరించారు. ఆ కాసేపటికే తనకి నోటీసులు అందాయ్. రేపు ఎన్ సీబీ విచారణకు హాజరవుతానని రకుల్ తెలిపింది.
మరోవైపు ఈ కేసులో డిజైనర్ సిమోన్ ఖంబట్టాను ఈరోజు ఎన్సీబీ అధికారులు విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెని విచారించారు. సుశాంత్ తో పరిచయం, పార్టీలు గురించి అడిగినట్టు తెలుస్తోంది. వాట్సాప్ చాట్ ని చూపించి.. వాటిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక రేపు శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లని ఎన్ సీబీ అధికారులు విచారించనున్నారు. ఎల్లుండి దీపిక, ఆమె మేనేజర్ కరిష్మాని విచారించనున్నారు.