విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్’గా రష్మిక మందన !


విజయ్ దేవరకొండ-రష్మిక మందన లది హిట్ పెయిర్. వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించారు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వీరిద్దరు  కూడా మంచి స్నేహితులుగా మారారని చెబుతారు. స్నేహితులు మాత్రమే కాదు అంతకుమించి వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై విజయ్, రస్మిక ఇప్పటి వరకు బయటపడలేదు. స్పందింలేదు కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్టుంది రస్మిక విజయ్ ఇంట్లో వాలిపోయింది. విజయ్ ఫ్యామిలీలో ఒకరికిగా కలిసిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ తల్లి మాధవి 50వ పుట్టినరోజు వేడుకల్లో రస్మిక మెరిసింది. కేవలం ఇంట్లోనే కుటుంబ వేడుకలా మాధవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. బయటి నుంచి వచ్చిన ఏకైక అతిథి రస్మక మాత్రమే. ఈ నేపథ్యంలో విజయ్-రస్మిక ప్రేమలో ఉన్నారా ? అనే గాసిప్ లు మొదలయ్యాయ్. ఇండస్ట్రీలో విజయ్ కి చాలా మంది స్నేహితులున్నారు. వారెవ్వరు విజయ్ అమ్మ పుట్టినరోజు వేడుకలకి హాజరుకాలేదు. ఒక్క రస్మిక మాత్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయ్-రస్మిక మధ్య ఏమైనా నడుస్తుందా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక రస్మిక పుష్ప సినిమా కోసం రెడీ అవుతోంది.