రియా బెయిల్ పిటిషన్లో సంచలన విషయాలు !
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో వెలుగులోనికి వచ్చిన డ్రగ్స్ కేసు రియా చక్రవర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. రియా బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. రియా బెయిల్ పిటిషన్లో ఆమె లాయర్ సంచలన విషయాలు పేర్కొన్నట్టు జాతీయ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. అందులో సుశాంత్ ఫ్యామిలీపై షాకింగ్ ఆరోపణలున్నాయి.
‘మానసిక కుంగుబాటు, ఇతర విషయాలను తెలియజేసేందుకు సుశాంత్ తరచూ రియా కుటుంబంతో మాట్లాడుతుండేవాడు. కానీ, సుశాంత్ కుటుంబం మాత్రం ఆయన విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేది. గతేడాది నవంబరు మూడో వారంలో సుశాంత్.. ముగ్గురు సోదరీమణులు ముంబయికి వచ్చారు. సరైన చికిత్స కోసం అతనిని చండీగఢ్‌కు తీసుకువెళ్తామని చెప్పారు.
వారి నిర్ణయానికి నా క్లయింట్ రియా చక్రవర్తి ఎదురు చెప్పలేదు. నిజం చెప్పాలంటే.. ఎట్టకేలకు సుశాంత్ కుటుంబసభ్యులు అతని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడుతున్నారని చాలా సంతోషించింది. ‘నా దగ్గర ఉన్న ఆస్తి కోసమే వారు ఇదంతా చేస్తున్నారు. అందుకే తాను వాళ్లతో చండీగఢ్‌కు వెళ్లను’ అని నవంబర్ 26న సుశాంత్ నా క్లయింట్ రియాతో చెప్పాడు. అదే రోజు రాత్రి మానసిక కుంగుబాటుతో ఇబ్బంది పడుతోన్న సుశాంత్‌ని ఒంటరిగా వదిలేసి ఆయన సోదరీమణులు వెళ్లిపోయారు’ రియా బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు