డ్రగ్స్ కేసులో కంగనాని ఎందుకు వదిలేస్తున్నారు ?

బాలీవుడ్ డ్రగ్ కేసులో స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ సమన్లు జారీ చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితోపాటు డ్రగ్స్‌ సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వాట్సాప్‌ సందేశాల ఆధారంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారే ఆరోపణలతో బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొణె, సారాఅలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, రకుల్‌కు ఎన్సీబీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. అయితే సుశాంత్ మరణం తర్వాత సంచలన ఆరోపణలు చేసిన కంగనా.. గతంలోనూ తాను డ్రగ్స్  కి అడెక్ట్ అయ్యానని తెలిపింది. దాని నుంచి బయటపడి కెరీర్ లో ఎదిగానని తెలిపింది. స్వయంగా డ్రగ్స్ వాడానని ఒప్పేసుకున్న కంగనాకి ఎన్ సీబీ అధికారులు ఎందుకు సమన్లు పంపడం లేదు.? ఆమెని ఎందుకు విచారించడం లేదని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నగ్మా ప్రశ్నించారు.

ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఎన్సీబీ తీరుపై నిప్పులు చెరిగారు. ‘వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని కొంతమంది నటీమణులకు సమన్లు జారీ చేసినప్పుడు.. డ్రగ్స్‌ తీసుకున్నానని బహిరంగంగా చెప్పిన కంగన రనౌత్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు ఎందుకివ్వలేదు?. సెలబ్రిటీల సమాచారాన్ని పత్రికలకు అందచేసి వారిని ప్రజల్లో అపఖ్యాతి పాలుచేయడం ఎన్సీబీ విధా? ఇది నిజంగా విచారకరమైన విషయం’ అని నగ్మా రాసుకొచ్చారు.