హేమంత్ హత్యకు నెలరోజుల క్రితమే ప్లాన్.. రూ. 10 లక్షల సుపారీ !
హైదరాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం… చందానగర్‌కు చెందిన హేమంత్, లక్ష్మారెడ్డి కుమార్తె అవంతి రెడ్డి జూన్ 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. జూన్ 11న అవంతి- హేమంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి నాలుగు నెలల పాటు అవంతి తల్లిదండ్రులు అవమానంతో ఇల్లు దాటి బయటకు రాలేదు. పగతో రగిలిపోతున్న లక్ష్మారెడ్డి హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు నెల రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశాడు.
లక్ష్మారెడ్డి భార్య అర్చన సోదరుడు యుగేంధర్‌రెడ్డి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. అక్కా-బావ కళ్లలో ఆనందం చూడటానికి హేమంత్ ని హత్య చేపించేందుకు యుగేందర్ రెడ్ది ఒప్పుకున్నారు. ఇందుకోసం రూ. 10లక్షల ఖర్చు అవుతుందని చెప్పాడు. అందుకు లక్ష్మారెడ్డి ఓకే చెప్పడంతో.. స్పాట్ లో రూ. లక్ష ఇచ్చాడు. వాటిని తీసుకెళ్లి కిరాయి గుండాలకి ముగ్గురి చెరో రూ. 5వేలు ఇచ్చాడు యుగేందర్ రెడ్ది. ఈనెల 24 మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు, కిరాయి హంతకులు హేమంత్, అవంతిపై దాడి చేస్తూ బలవంతంగా కారులో ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుకుందామని కారు గోపన్‌పల్లి వైపు మళ్లించారు. గోపన్‌పల్లి వద్ద కారునుంచి అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. పారిపోతున్న వారిద్దరినీ పట్టుకున్నారు. అదే రోజు రాత్రి 7.30గంటలకు కారులోనే హేమంత్‌ను హతమార్చారు.