బాలుకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్ !
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆయన మన మధ్యేనే ఉన్నారు. ఉంటారు. దయచేసి బాలు మృతి చెందారని ఎవరు అనవద్దని పలువురు విజ్ఝప్తి చేస్తున్నారు. ఇక బాలుకి భారత్నరత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. బాలు మృతి చెందిన రోజే.. ఆయనకి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటుడు అర్జున్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా బాలుకు ‘భారతరత్న ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి లేఖ రాశారు. సినీ, రాజకీయ ప్రముఖులే కాదు… సామాన్య ప్రజలు కూడా బాలు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు ఆయన అర్హుడని చెబుతున్నారు. మరీ.. అభిమానుల కోరికని కేంద్రం తీరుస్తుందా… ? బాలుకు భారతరత్న ఇస్తుందా?? అనేది చూడాలి.
కరోనా సోకడంతో ఆగస్టు 5న ఎస్పీబీ చెన్నైలోనే ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. తొలినాళ్లలో కోలుకున్నట్లు కనిపించిన ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ రావడంతో వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నెగెటివ్ వచ్చింది. క్రమంగా ఆరోగ్యం మెరుగవుతున్న సమయంలో ఈ నెల 24న మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో 25వ తేదీ మధ్యాహ్నం 1.04గంటలకు తుది శ్వాస విడిచారు.