దేశంలో.. 60లక్షలు దాటిన కరోనా కేసులు, 50 లక్షలు దాటిన రికవరీ !
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 82,170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షల 74వేలకు చేరింది. నిన్న మరో 1039మంది కరోనా రోగులు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 95,542కు చేరింది. గడిచిన 24గంటల్లో 75వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఇప్పటివరకు 50లక్షల 16వేల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం దేశంలో 9లక్షల 62వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 82.58శాతంగా ఉంది. కేవలం గత 11రోజుల్లోనే 10లక్షల మంది కోలుకున్నారు . కేవలం ఒక్క మహారాష్ట్రలోనే నిత్యం 400లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ 35వేల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 9వేల మంది ప్రాణాలు కోల్పోగా కర్ణాటకలో 8500మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.57శాతంగా ఉంది.