పూరికి మహేష్ బర్త్ డే గిఫ్ట్ !

మహేష్ బాబు-పూరి జగన్నాథ్’లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సూపర్ హిట్ అయ్యాయ్. వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం ‘జనగనమణ’ సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అయితే ఈ సినిమా ప్రకటనకే పరిమితం అయింది. ఈ సినిమా పట్ల మహేష్ అసంతృప్తిలో ఉన్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి చెప్పిన సంగతి తెలిసిందే.

మహేశ్ మాత్రం పూరితో సినిమా చేసేందుకు రెడీ. ఆయన కథతో వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పూరికి మహేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో జనగనమన సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. పూరి బర్త్ డే కానుకగా ఈ సినిమాని మహేష్ ఓకే చేసి ఉంటారని చెప్పుకొంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేడు.
ప్రస్తుతం పూరి ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ దేవవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత పూరి చేయబోయే సినిమా ఇంకా ఖరారు కాలేదు. బహుశా… అది పూరి-మహేశ్ హ్యాట్రిక్ సినిమా అయి ఉంటుందేమోనని అంటున్నారు.