నో డౌట్.. ధోని వారసుడు సంజూనే !
టీమిండియాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి నెం.4. చాన్నాళ్లుగా టీమిండియాని ఈ సమస్య వెంటాడుతోంది. 2019 వరల్డ్ కప్ గెలవలేకపోవడానికి కూడా కారణం ఇదేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థ ఆటగాడు ఇంకా దొరకలేదు. ఇక మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తో ఆయన స్థానం ఖాళీ అయింది. ఈ రెండు స్థానాలకు ఈ ఐపీఎల్ ముగిసేలోగా సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభంలోనే ధోని వారసుడు దొరికాడని ప్రేక్షకులు చెబుతున్నారు. అతడే సంజు శాంసన్.
ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా సిక్సర్లు బాధేస్తున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఇక నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4×4, 7×6) రాణించారు. దీంతో.. పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిగలిగింది.
గతంలో ధోని వారసుడిగా రిషబ్ పంత్ పేరు వినిపించేది. కానీ అతడు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు. కీలక సమయాల్లో వికెట్ పడేసుకుంటున్నాడు. అంతకుమించి ఆటని, పరిస్థితిని అర్థం చేసుకోవడం విఫలం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా సంజూని ఫిక్సయిపోవచ్చని క్రికెట్ అభిమానులు చెప్పుకొంటున్నారు. ఇక నెం. 4 కూడా దొరికితే టీమిండియా మరింత బలంగా మారనుంది.
ఇక నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4×4, 7×6), స్టీవ్‌స్మిత్(50; 27 బంతుల్లో 7×4, 2×6) చెలరేగి ఆడారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(106; 50 బంతుల్లో 10×4, 7×6), కెప్టెన్ కేఎల్ రాహుల్(69; 54 బంతుల్లో 7×4, 1×6) ఆది నుంచీ బౌండరీలతో అలరించారు