తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ.. పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,87,211కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది. ఆదివారం 1,932 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,56,431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వీరిలో 24,054 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.