రాహుల్ గాంధీని నమ్ముకున్న దీపికా పదుకొనె

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ  నేతలకే నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే రాహుల్ కే తనమీద తనకి నమ్మకం లేదు. అలాంటి రాహుల్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె భారీ ఆశలు, అంచనాలు పెట్టుకుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని దీపిక అంది. అయితే ఇవి దీపిక చేసిన లెటెస్ట్ కామెంట్స్ కాదు. ఈ యేడాది జనవరిలో ఓ ఇంటర్వ్యూలో దీపిక అన్న మాటలివి.

డ్రగ్స్ కెసులో దీపికా ఎన్ సీబీ విచారణకు హాజరైన తర్వాత.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “రాహుల్ గాంధీ దేశానికి మంచి ఉదాహరణగా నిలుస్తారు. ఏదో ఓ రోజు కచ్చితంగా ప్రధాని అవుతారు. దేశంలోని యువతతో ఆయన బాగా కనెక్ట్ కాగలుగుతారు. సంప్రదాయంగా ఆలోచిస్తారు. అలాగే భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు.” అంటూ దీపికా ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించిన వారు. కావాలనే వారిని టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే డ్రగ్స్ కేసు వెనకాల వ్యవహారం అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉందని చెబుతున్నారు. అయితే విచారణలో తాను డ్రగ్స్ చాట్ చేసనని దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది.