యువీ సిక్సర్ల రికార్డ్.. జస్ట్ మిస్ !

2007 టీ20 వరల్డ్‌ కప్’లో యువరాజ్ సింగ్ 6 బంతులకు 6 సిక్సర్స్ బాదిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ ఘనతని సాధించాడు. ఈ మ్యాచ్ లో యువీ 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. ఇప్పుడి వరకు యువీ సిక్సర్ల రికార్డ్ బద్దలు కాలేదు. నిన్న రాజస్థాన్-పంజాయ్ మ్యాచ్ లో యువీ సిక్సర్ల రికార్డ్ తృటిలో మిస్ అయింది.

నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ నిర్థేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ చేధించింది.కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్‌ తేవటియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. రాహుల్ తేవటియా మొదట పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే సంజూశాంసన్ అవుటైన తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. సిక్సర్స్ తో విరుచుకుపడ్డాడు. కాట్రెల్‌ వేసిన18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి ఔరా అనిపించాడు. దీంతో.. యువీ ఆరు సిక్సర్స్ రికార్డ్ జస్ట్ మిస్సయింది.

రాహుల్ తేవటియా 5 సిక్సర్స్ పై యువరాజ్ స్పందించారు. “మిస్టర్‌ రాహుల్‌ తేవటియా.. వద్దు భాయ్‌ వద్దు.. ఆ ఒక్క బంతి వదిలేసినందుకు ధన్యవాదాలు!’’అని సరదాగా వ్యాఖ్యానించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మయాంక్, సంజూశాంసన్, తేవాటియాలని యువీ అబినందించారు.