డ్రగ్స్ కేసు : మరో ముగ్గురికి ఎన్సీబీ నోటీసులు 

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకి ఎన్ సీబీ నోటీసులు జారీ చేసి.. విచారించి. విచారణలో ఈ నలుగురు హీరోయిన్స్ చెప్పిన డేటా ఆధారంగా మరొకొందరికి నోటీసులు జారీ చేసి.. విచారించబోతున్నట్టు సమాచారమ్. మరో ముగ్గురు నటులకి ఎన్ సీబీ నోటీసులు అందబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ ముగ్గురిలో కరణ్ జోహార్ ఉండవచ్చని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ కూడా నోటీసులు అందే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోనిక్ చక్రవర్తితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. వారి కాల్ డేటా, చాట్ డేటా ఆధారంగా