గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు ? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ !

గ్రేటర్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. నవంబర్ రెండో వారం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధులతో జ‌రిగిన భేటీలో కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి న‌గ‌రానికి చెందిన‌ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త ఐదేండ్లుగా జ‌రిగిన అభివృద్ధి గురించి ఒక ప్ర‌గ‌తి నివేదిక‌ను రూపొందించి విడుదల చేస్తామన్నారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించడంతోపాటు వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచింద‌ని తెలిపారు. అంతేగాక‌ లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించింద‌న్నారు. హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఐడేండ్ల‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని కేటీఆర్ అన్నారు.