విజయ్-సుక్కు సినిమా అప్పుడే రూ. 15కోట్ల ఖర్చా ?

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఫిక్సైన సంగతి తెలిసిందే. దీనికి నిర్మాత కేదార్. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు, కొన్ని వ్యాపారాల్లో భాగస్వామి కూడా. ఈ సినిమా కోసం కేదార్ భారీగా ఖర్చుపెడుతున్నట్టు సమాచారమ్. కేవలం సినిమా ప్రకటనకి ముందే రూ. 15 కోట్లు ఖర్చు చేశాడట. రూ. 10కోట్లు సుక్కుకి అడ్వాన్స్ గా ఇచ్చారు. మరో రూ. 5కోట్లు సినిమా అడ్వాన్సుల కిందే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి కేదార్ స్నేహితుడు అల్లు అర్జున్ తోనే సినిమా చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సడెన్ తో విజయ్ దేవరకొండతో ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువ. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘ఫైటర్’ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో విజయ్ ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక సుక్కు-బన్నీ హాట్రిక్ చిత్రం పుష్ప కూడా పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో సుక్కు-విజయ్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా వస్తుందని చెప్పుకొంటున్నారు. 2020లో ఈ సినిమా రాబోతుంది.