బాబ్రీ మసీదు నిందితులు వీరే !


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28యేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు తీర్పు వెలవడనుంది. 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఇది తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మొత్తం ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు కాగా.. విచారణ సమయంలో వీరిలో 17 మంది మరణించారు. ప్రస్తుతం 32 మంది ఉన్నారు. వీరిలో ఇవాళ 27 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. 5గురు మాత్రం అనారోగ్యం, ఇతర కారణల వలన కోర్టుకి రాలేదు.

ఈ కేసులో నిందితులు :

మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ (92), కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి(86), ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్‌ కటియార్‌, పవన్‌ పాండే, సుధీర్‌ కక్కర్‌, సతీశ్‌ ప్రధాన్‌, రాంచంద్ర ఖత్రి, సంతోశ్‌ దుబె, రాం విలాస్‌ వేదాంతి, ప్రకాశ్‌ శర్మ, గాంధీ యాదవ్‌, జై భాన్‌ సింగ్‌, లల్లు సింగ్‌, కమలేశ్‌ త్రిపాఠి, బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌, రాంజీ గుప్తా, మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌, చంపత్‌ రాయ్‌, సాక్షి మహారాజ్‌, వినయ్‌ కుమార్‌ రాయ్‌, నవీన్‌ భాయ్‌ శుక్లా, ధర్మదాస్‌, జై భగవాన్‌ గోయల్‌, అమర్‌నాథ్‌ గోయల్‌, విజయ్‌ బహదూర్‌ సింగ్‌, ఆర్‌.ఎం.శ్రీవాస్తవ, ధర్మేంద్ర సింగ్‌ గుర్జార్‌, ఓం ప్రకాశ్‌ పాండే, ఆచార్య ధర్మేంద్ర.

మరణించిన నిందితులు

బాలా సాహెబ్‌ ఠాక్రే, అశోక్‌ సింఘాల్‌, గిరిరాజ్‌ కిశోర్‌, పరమహంస రామచంద్ర దాస్‌, వినోద్‌ కుమార్‌ వత్స్‌, రాం నారాయణ్‌ దాస్‌, డి.బి.రాయ్‌, లక్ష్మీ నారాయణ్‌ దాస్‌, హర్‌గోవింద్‌ సింగ్‌, రమేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, దేవేంద్ర బహదూర్‌, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్‌ సావే, మహంత్‌ అవైద్యనాథ్‌, మహామండలేశ్వర్‌ జగదీశ్‌ ముని మహారాజ్‌, వైకుంఠ్‌ లాల్‌ శర్మ, సతీశ్‌ కుమార్‌ నాగర్‌.