సోనూసూద్ కోసం దర్శకుల క్యూ

బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ఇప్పుడు కనిపించే దైవం. కరోనా విజృంభిస్తున్న టైమ్ లో ఆయన చేసిన సేవ వెలకట్టలేనిది. ఆయన సేవని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. దీంతో ఆయనకి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే పనిలో దర్శకులు ఉన్నారు. ఇటీవల అల్లుడు అదుర్స్ సినిమా కోసం సోనూసూద్ హైదాబాద్ కి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకులు వరుసపెట్టి సోనూసూద్ ని కలుస్తున్నారు. కథలు వినిపిస్తున్నారు.

ఇప్పటి వరకు 8 మంది దర్శకులు సోనూసూద్ ని కలిసినట్టు తెలుస్తోంది. అందులో కొన్ని విల‌న్ పాత్ర‌లుంటే.. ఇంకొన్ని హీరో క‌థ‌లున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సోనూసూద్ క‌థానాయకుడిగా ఓ అగ్ర నిర్మాణ సంస్థ సినిమా మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజంగా ఇకపై సోనూసూద్ ని విలన్ గా చూడలేం. ఆయన ఓ రియల్ హీరో తెలిసాక కూడా విలన్ పాత్రలో చూపించడం నేరేమేమో.. !