‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ డేటు ఫిక్స్

హారర్ కామెడీ ‘కాంచన’ (ముని) సిరీస్ తెలుగులో సూపర్ హిట్. ఇప్పుడీ కాంచన బాలీవుడ్ కి వెళ్లింది. బాలీవుడ్ ‘కాంచన’కు ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్-కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించనున్నారు. హారర్, కామెడీ మూవీ కాబట్టి హిందీలోనూ బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

ఇప్పుడీ సినిమా రిలీజ్ డేటు ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 9న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో #DisneyPlusHotstarలో రిలీజ్ కాబోతుంది. మిగితా దేశాల్లో మాత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేటుని తెలియజేస్తూ చిత్రబృందం అధికారికంగా ట్విట్ చేసింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని  పంచుకుంది. అక్షయ్ డుయల్ లుక్ లో ఉన్న కనిపిస్తున్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది.