బిగ్ బాస్ హౌస్’లో పైసా వసూల్


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నాల్గో వారంలోకి అడుగుపెట్టింది. ఎలిమినేషన్ ప్రాసెస్ తో సోమవారం ఏపీసోడ్ ఎప్పుడూ సీరియస్ గా సాగుతుంటుంది. ఈ సోమవారం కూడా అదే మూడులో జరిగిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం షోని మాత్రం కాస్త ఎంటర్ టైనింగ్ గా ప్లాన్ చేశారు. పైసా వసూల్ షో చేసేశారు. బయటి నుంచి డబ్బులు వెదజల్లితే వాటిని సభ్యులు ఏరుకోవాలి. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తే.. వారికి అదనపు బెనిఫిట్స్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఇంటి ఆవరణలో పడుతున్న డబ్బులని ఏరుకోవడానికి సభ్యులు తెగ ఆరాటపడ్డారు.

వరు ఎన్ని సంపాదించారు అన్నది ఇవాళ్టి షోలో తేలనుంది. అయితే డబ్బులని ఏరుకోవడం ఒక ఎత్తైతే.. వాటిని ఎక్కడ దాచుకోవాలలి అనేది మరో ఎత్తు. ఎక్కడపడితే అక్కడ పెట్టేసుకున్నారు సభ్యులు. ఒకరు జాకెట్ లో, మరొకరు ప్లాస్టిక్ కవర్స్ లో, బెడ్ కిందా.. ఇలా ఎక్కడపడితే అక్కడ దాచేశారు. డబ్బులని ఏరుకునే క్రమంలో అమ్మరాజశేఖర్ జారీ కిందపడిపోయారు. అయినా.. ఆయన ఏరుకోవడం ఆపలేదు. దివి మాత్రం డల్ గా కనిపించింది. ఈ టాస్క్ నుంచి గంగవ్వకు మినహాయింపునిచ్చారు. మొత్తానికి.. మంగళవారం బిగ్ బాస్ షో పైసా వసుల్ గా సాగింది.