యూఫీ ఘటనపై రాహుల్ గాంధీ స్పందన 

దేశంలో నిర్భయ ఘటన రిపీటైన సంగతి తెలిసిందే. యూపీలో 20యేళ్ల యువతిని నలుగురు దుండగులు నాలుకకోరి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు యువతి మృతి చెందింది. యూపీ అత్యాచార ఘటన, బాధితురాలికి అంత్యక్రియలు జరిపిన తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వరస ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“భరతమాత కుమార్తె అత్యాచారానికి గురైంది. నిజాలను పాతిపెట్టారు. చివరికి ఆ మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కును కూడా ఆమె కుటుంబ సభ్యులను నుంచి లాక్కున్నారు. ఇది తీవ్ర అన్యాయం. దళితులను అణచివేయడానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య ఇది. సమాజంలో వారి ‘స్థానం’ వారికి చూపించండి” అంటూ మండిపడ్డారు.