లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న రాజ్ తరుణ్
కుర్ర హీరో రాజ్ తరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్ లో నటించిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుమార్ 21ఎఫ్, సినిమా చూపిస్తా మామ సినిమాతో విజయాలు అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజ వారసుడు, మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. ఇంతలో ప్లాపుల్లోకి వెళ్లాడు. దాన్నుంచి బయటపడేందుకు ఓరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా హిట్టయితే రాజ్ తరుణ్ తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చేసినట్టే.
తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. తాను కూడా బ్యాడ్బాయ్నేనని అందుకే బ్యాంకాక్ వెళ్లాలని సరదాగా అన్నాడు. పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను లవ్ మ్యారేజే చేసుకుంటానని, కాకపోతే దానికి ఇంకా సమయం ఉందనన్నారు. ఈ ఏపీసోడ్ అక్టోబర్ 5న ప్రసారం కానుంది.