ఐపీఎల్’లో హైదరాబాద్ తొలి విజయం
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల బాటపట్టింది. పటిష్టమైన ఢిల్లీపై ఈజీగానే గెలిచేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(45; 33 బంతుల్లో 3×4, 2×6), జానీ బెయిర్‌స్టో(54; 48 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. కేన్ విలియ్సమన్(41; 26 బంతుల్లో 5×4) మెరుపు బ్యాటింగ్ చేశాడు.
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ టీమ్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 147/7కే పరిమితమైంది. కీలక సమయాల్లో రషీద్‌ఖాన్ 3, భువనేశ్వర్ 2 వికెట్లతో చెలరేగడంతో దిల్లీ బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్(34; 31 బంతుల్లో, 4×4) ధాటిగా ఆడగా మధ్యలో రిషభ్ పంత్(28; 27 బంతుల్లో 1×4, 2×6), షిమ్రన్ హెట్‌మైయిర్(21; 12 బంతుల్లో 2×6) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి.. మ్యాచ్‌పై పట్టు సాధించారు.