సంజూ శాంసన్’కు గాయంపై సచిన్ మాట 


నిన్నటి కోల్ కతాతో మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాడు సంజుశాంసన్ తలకి గాయమైన సంగతి తెలిసిందే. కోల్‌కతా ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ టామ్‌ కరన్‌ వేసిన చివరి బంతిని ప్యాట్‌ కమిన్స్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లోకి బలంగా బాదాడు. బౌండరీలైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న సంజు గాల్లోకి ఎగిరి ఆ బంతిని అందుకున్నాడు. నేలమీదకు దిగే క్రమంలో అదుపుతప్పి పడిపోయాడు. సంజు తలకు స్వల్ప గాయమైంది. దీనిపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ స్పందించారు.

‘ఆ నొప్పి తనకూ తెలుసు. అలాంటి ఘటనను తాను కూడా ఎదుర్కొన్నా.శాంసన్‌ పట్టిన క్యాచ్‌ అద్భుతం. బంతిని అందుకునే క్రమంలో తల నేలకి తగిలితే ఎంత నొప్పి ఉంటుందో నాకు తెలుసు. 1992 వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నాకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది’ అని సచిన్ తెలిపారు. ఇక నిన్నటి మ్యాచ్ లో కోల్ కతా 37 పరుగుల తేడాతో రాజస్థాన్ ని ఓడించిన సంగతి తెలిసిందే.