బిగ్ బాస్ : ఫ్యాషన్ షో.. అవినాష్ జబర్థస్త్ పంచ్’లు !

బిగ్ బాస్ తెలుగు నేటి ఏపీసోడ్ జబర్థస్త్ గా ఉండబోతుంది. కొద్దిసేపటి క్రితమే స్టార్ మా ఈరోజు ఏపీసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది. సభ్యులు ఫ్యాషన్ షోతో అలరించారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ అద్దంగా మారారు. అందం ముందు ఆడవాళ్లు చూసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా అవినాష్ వేసిన పంచులు బాగా పేలాయ్.

ఆడవాళ్లందరిపై అవినాష్ సటైర్స్ వేస్తే.. గంగవ్వ మాత్రం అవినాశ్ కి పంచ్ ఇచ్చింది. నా ముక్కేంది ఇంత పెద్దగా క‌న‌బ‌డుతుంద‌ని గంగవ్వ అనే స‌రికి హౌజ్‌మేట్స్ అంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసారు. ఇక మోనాల్, స్వాతి దీక్షిత్, హరియాణ, హారిక, లాస్యలపై అవినాష్ వేసిన పంచులు హైలైట్ గా నిలిచాయి. మొత్తంగా ఈరోజు ఏపీసోడ్ అవినాష్ షో గా మిగిలేలా ఉంది.