వైరల్ : బీజేపీ నేత రాసలీల వీడియోస్


తెలంగాణ బీజేపీ ఇజ్జత్ పోయే పనిచేశారు ఆ పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు బాస స‌త్య‌నారాయ‌ణ‌. మహిళా కార్యకర్తని లోబర్చుకొని.. ఆమెతో రాసలీలలు సాగించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణపై వేటు వేశారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్. నూత‌న అధ్య‌క్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియ‌మించారు.

ఇప్పుడు బస సత్యనారాయణ వ్యవహారం తెలంగాణ భాజాపాకు తలనొప్పిగా మారింది. ఆయన ఓ మ‌హిళ కార్య‌క‌ర్త‌ను బాస స‌త్య‌నారాయ‌ణ శారీర‌కంగా లొంగ‌దీసుకున్నట్లు తెలుస్తోంది. ప‌ద‌వులు రావేమోన‌నే భ‌యంతో ఆయ‌న ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్క‌డికి అంటే అక్క‌డికి ఆమె వెళ్లిన‌ట్లు స‌మాచారమ్. ఫైనల్ గా సత్యనారాయణ వేధింపులు తట్టుకోలేక.. స్వయంగా ఆమె మహిళనే వీడియోలు లీక్ చేసినట్టు చెప్పుకొంటున్నారు స్థానికులు.