రివ్యూ : నిశ్శబ్ధం – భరించలేం
చిత్రం : నిశ్శబ్ధం (2020)
నటీనటులు : అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినిపాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం : హేమంత్ మధుకర్
నిర్మాతలు : వివేక్ కూచిబొట్ల, విశ్వ ప్రసాద్, కోన వెంకట్
సంగీతం : గోపి సుందరం
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్
ఒటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేటు : అక్టోబర్ 2, 2020.
స్వీటీ అనుష్క – స్టార్ హీరోయిన్ అంతకుమించి. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు చేసిన అనుష్క నుంచి సాదాసీదా సినిమాలు ఆశించలేం. అలాంటి కథలని స్వీటీ కూడా ఓకే చేయదు కూడా. ఈ నేపథ్యంలో ‘భాగమతి’ తర్వాత అనుష ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించబోతుంది అని తెలిసి.. ఇద్రో ప్రయోగాత్మక సినిమా అనుకున్నాం.
సంచలన విజయం ఖాయం అనుకున్నారు అబిమానులు. అనుష్కతో పాటు పేరు మోసిన నటుడు మాధవన్ ఉన్నాడు. అంజలి, షాలినీ పాండే ఉండటంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక థియేటర్స్ కోసం ఇన్నాళ్లు వేచి చూసిన నిశ్శబ్ధం ఎట్టకేలకి ఓటీటీకి ఫిక్సయింది. ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరీ నిశ్శబ్ధం ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
సాక్షి (అనుష్కశెట్టి) పుట్టుకతోనే మూగ, చెవుడు. కానీ ఆమెలో అద్భుతమైన పెయింటింగ్ దాగి ఉంది. ఆమె నైపుణ్యానికి ఆకర్షితుడు అవుతాదు గొప్ప సంగీతకారుడు ఆంథోని (ఆర్ మాధవన్). వీరిద్దరు మంచి స్నేహితులు, ప్రేమికులు అవుతారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత సాక్షి స్నేహితురాలు (సొనాలి) అదృశ్యం అవుతుంది. ఆ క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో ఆంథోని హత్యకు గురవుతాడు. ఆంథోని హత్య మిస్టరీగా మారడంతో ఆ కేసును ఛేదించడానికి పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్ రిచర్డ్ (కిల్ బిల్ ఫేం మైఖేల్ మ్యాడ్సన్) సహాయంతో మరో పోలీసు అధికారి మహాలక్ష్మి (అంజలి) రంగంలోకి దిగుతుంది. అంథోని హత్య వెనక బయటకు కనిపించని నిజాలేంటీ ? అన్నది ఈ సినిమా కథ.
ఎవరెలా చేశారు ?
అమెరికాలోని సీటెల్‌లోని ఓ విల్లాలో జరిగిన హత్యల నేపథ్యంలో సినిమా సాగుతుంది. గతంలో ఈ విల్లా ఓ హత్య జరుగుతోంది. ఆ తర్వాత 40 యేళ్ల తర్వాత లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆంథోని హత్యకు గురవుతాడు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు మహాలక్ష్మీ (అంజలి) రంగంలోకి దిగుతుంది. దర్యాప్తులో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులని మునివేళ్లపై నిలబెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగదు. నిశబ్ధాని భరించలేం అన్నట్టుగా సినిమా సాగింది.
సినిమాలో అందరూ పేరున్న నటీనటులే ఉన్నారు. కానీ ఒక్కరి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. ఒక్క స్వీటీ అనుష్క పాత్రమే ఆకట్టుకుంటోంది. అదీ కూడా మూగ, చెవిటి పాత్రలో ఆమె అద్భుత నటన. బహుశా.. ఈ పాత్ర వైవిధ్యం చూసే స్వీటీ ఓకే చెప్పి ఉంటుంది. మిగితా కథ-కథనాలు నీరసంగా సాగుతాయి. ఏ ఒక్కరి పాత్ర ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్ కాదు.
సాంకేతికంగా :
టెక్నికల్ సినిమా బాగుంది. విదేశీ అందాలని బాగా చూపించారు. గోపీ సుందర్ అందించిన పాటలు ఓ మోసరుగా ఉన్నాయి. నేపథ్యం సంగీతం పర్వాలేదు. టెక్నికల్ గా సినిమా ఎంత బాగున్నా.. కథ ప్రేక్షకులకి కనెక్ట్ కావడం ప్రధానం. అది జరగలేదు. కథ-కథనాలు గ్రిప్పింగ్ సాగలేదు. దీంతో మూగ, చెవిటి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించిన.. అది వేస్ట్ అయిందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
* అనుష్క
* మైనస్ పాయింట్స్
* అనుష్క తప్ప అన్నీ
* కథ-కథనం
* సంగీతం
రేటింగ్ : 2.5/5
నోట్ : ఇది విశ్లేషకుడికి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.