ఓరేయ్ బుజ్జిగా – ఓ గాసిప్ కథ
విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్-మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఓరేయ్ బుజ్జిగా’. హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించారు. కె.కె రాధా మోహన్ నిర్మాత. థియేటర్స్ కోసం వేచి చూసి.. ఓటీటీలోకి వచ్చిన సినిమా ఇది. నిన్న (అక్టోబర్1) ‘ఆహా’లో విడుదలైంది. కామెడీ ఓవర్ డోస్ గా బుజ్జిగాడు ఉంటాడని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు విజయ్ చెప్పాడు. అది నిజమే. కానీ అక్కడక్కడ మాత్రమే కామెడీ ఓవర్ డోస్ అనిపించింది.
కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదో గాసిప్ కథ. ఓ ఊర్లో ఓ అమ్మాయి, ఓ అబ్బాయ్ ఒకే రోజు ఇంటి నుంచి పారిపోతారు. అమ్మాయి అయితే మరికొద్దిసేపట్లో పెళ్లి పీఠలు ఎక్కి, మూడు ముళ్ళు వేయించుకొనే టైమ్ లో చెక్కేస్తోంది. దీంతో.. వీరిద్దరు కలిసి జంప్ అయ్యారనేది ఆ ఊర్లో గాసిప్. ఈ పాయింట్ నుంచి బోలెడంత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. దర్శకుడు మరో యాంగిల్ ఎంచుకున్నాడు. పారిపోయిన బుజ్జిగాడిపై పారిపోయిన అమ్మాయి కసిని పెంచుకోవడం, వీరిద్దరు ఒకరికొకరు తెలికుండా, ఓకే ఊరి వాళ్లమని తెలియకుండా ప్రేమలో పడటం. ఈ గాసిప్ కథలో అక్కడక్కడ నవ్వులు.. మిగితాదంతా బోరింగ్ లా అనిపిస్తుంది.