ఢిల్లీతో కోల్ కతా ఓడింది. కానీ.. గెలిచింది !
శనివారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ నిర్దేశించిన 229 పరుగులని చేధించే క్రమంలో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. 18 ఓవర్ వరకు మ్యాచ్ కోల్ కతా చేతిలో ఉంది. మోర్గాన్ 44 (18 బంతుల్లో), రాహుల్ త్రిపాఠి 36 (బంతుల్లో) చేలరేగి ఆడారు. చాలా స్వల్ప వ్యవధిలో వీరు అవుట్ కావడంతో కోల్ కతా గెలుపు ముందట బోల్తా పడినట్టయింది. ఈ మ్యాచ్ కోల్ కతా గెలవకపోయినా.. అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రేక్షకుల మనసులని గెలిచేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (88 నాటౌట్; 38 బంతుల్లో 7×4, 6×6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో పాటు ఓపెనర్ పృథ్వీషా (66; 41 బంతుల్లో 4×4, 4×6), రిషభ్ పంత్ (38; 17 బంతుల్లో 5×4, 1×6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో కోల్కతా ముందు దిల్లీ భారీ లక్ష్యాన్ని ఉంచింది. రసెల్ 2 వికెట్లు తీయగా వరుణ్, నాగర్కోటి చెరో వికెట్ పడగొట్టారు.