‘మోసగాళ్లు’ టీజర్ టాక్ – షార్ట్ అండ్ స్వీట్
జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా టీజర్ ని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.
‘450 మిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన వాళ్లను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని.. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగంతో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత డబ్బు కట్టలు చూపిస్తూ.. ఇది సరిపోతుందిగా అని కాజల్ అడగగా… ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటూ విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అరనిమిషం నిడివితో టీజర్ ని షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేశారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. నవదీప్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.