బిగ్ షాక్.. స్వాతి దీక్షత్ ఎలిమినేట్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా నాల్గో వారాన్ని పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ని బిగ్ బాస్ కాస్త భిన్నంగా ప్లాన్ చేశారు. ప్రతివారంలా ఊరించి.. ఉడికించి కాకుండా నేరుగా ఎలిమినేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ వారం అభిజీత్‌, హారిక‌,  సోహైల్‌, లాస్య‌, మొహ‌బూబ్‌, స్వాతి దీక్షిత్‌, కుమార్ సాయి  ఎలిమినేషన్ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో కుమార్ సాయి కెప్టెన్ కావడం వలన ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.  ఇక మిగిలిన వారిలో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించారు. ఆమెతో రేపు మాట్లాడబోతున్నారు.

ఇక మిగిలిన  అభిజీత్‌, హారిక‌,  సోహైల్‌, లాస్య‌, మొహ‌బూబ్‌  కూడా సేఫ్ అయినట్టు కాదు. వారు ఎలిమినేషన్ లిస్టులోనే ఉన్నట్టు నాగ్ ప్రకటించారు. దీంతో.. రేపు మరో ఎలిమినేషన్ ఉండాలి. లెదంటే.. ? స్వాతి దీక్షిత్ ది ఫేక్ ఎలిమినేషన్ అయి ఉండాలి. తిరిగి ఆమె రేపు లేదా కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి పంపించే ఛాన్స్ అన్న ఉండాలి. మొత్తానికి బిగ్ బాస్ ఈ సీజన్ ని రసవత్తరంగానే ప్లాన్ చేస్తున్నాడు. ఐపీఎల్ హవాని తట్టుకొని నిలబడాలంటే.. ? ఆ మాత్రం ఉండాలి మరీ.. !